భారత నౌకాదళం 2026 విద్యా సంవత్సరానికి గాను 10+2 (బీటెక్) క్యాడెట్ ఎంట్రీ స్కీమ్ కింద పెళ్లి కాని పురుషులు, మహిళా అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ ఎగ్జామ్ ద్వారా ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌ల్లో పర్మనెంట్ కమిషన్డ్ ఆఫీసర్లుగా చేరే అవకాశం లభిస్తుంది. మొత్తం ఎగ్జిక్యూటివ్, టెక్నికల్ బ్రాంచ్‌లు కలిపి 44 ఖాళీలు ఉన్నట్లు నోటిఫికేషన్లో ఇండియన్ నేవీ వెల్లడించింది. మహిళల కోటాలో భాగంగా మొత్తం ఖాళీల్లో గరిష్టంగా 7 సీట్లు కేటాయించారు.
ఈ క్యాడెట్ ఎంట్రీ స్కీమ్‌కు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 2007 జనవరి 2వ తేదీ నుంచి 2009 జూలై 1వ తేదీ మధ్య జన్మించి ఉండాలని తెలిపారు. ఈ రెండు తేదీల్లో పుట్టిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇక విద్యార్హతల విషయానికి వస్తే.. అభ్యర్థులు ఇంటర్మీడియట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ సబ్జెక్టుల్లో కనీసం 70 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. 10వ తరగతి లేదా 12వ తరగతిలో ఇంగ్లీష్ సబ్జెక్టులో కనీసం 50 శాతం మార్కులు ఉండాలి.
అభ్యర్థులు తప్పనిసరిగా జేఈఈ మెయిన్స్ 2025 (JEE Main 2025) పరీక్షకు హాజరై ఉండాలి. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) విడుదల చేసిన ఆల్ ఇండియా కామన్ ర్యాంక్ లిస్ట్ (సీఆర్ఎల్) ఆధారంగానే అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. జేఈఈ మెయిన్స్ 2025 సీఆర్ఎల్ ర్యాంక్ ఆధారంగా కటాఫ్ నిర్ణయించి అభ్యర్థులను ఎంపిక చేస్తారు. షార్ట్‌లిస్ట్ అయిన వారికి 2026 మార్చి నుంచి బెంగళూరు, భోపాల్, కోల్‌కతా, విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు జరుగుతాయి. మొదటిసారి ఎస్ఎస్బీ ఇంటర్వ్యూకు హాజరయ్యే వారికి నిబంధనల ప్రకారం 3-టైర్ ఏసీ రైలు ఛార్జీలు రీయింబర్స్ చేస్తారు. ఇక అన్ని దశలు దాటి.. ఎంపికైన వారికి కేరళలోని ఎజిమల ఇండియన్ నావల్ అకాడమీలో ట్రైనింగ్ ఇస్తారు.
ఇంటర్వ్యూలో అర్హత సాధించిన అభ్యర్థులకు ఇండియన్ నేవీ ప్రమాణాల ప్రకారం మెడికల్ టెస్టులు నిర్వహిస్తారు. ఎస్ఎస్బీ మార్కులు, మెడికల్ ఫిట్నెస్ ఆధారంగా అభ్యర్థులను ఫైనల్ సెలక్షన్ చేస్తారు. దరఖాస్తులకు చివరి తేదీ జనవరి 19వ తేదీ అని ప్రకటించారు. దరఖాస్తు చేసుకునేందుకు ఇండియన్ నేవీ వెబ్సైట్లోకి వెళ్లి ఈ-మెయిల్, మొబైల్ నంబర్‌తో రిజిస్టర్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ పూర్తి అయిన తర్వాత '10+2 (B.Tech) Cadet Entry Scheme' లింక్‌పై క్లిక్ చేయాలి. అందులో అడిగిన వివరాలు, విద్యార్హతలుస జేఈఈ మెయిన్స్ 2025 సీఆర్ఎల్ ర్యాంక్ ఎంటర్ చేయాలి. అవసరమైన పత్రాలను అప్లోడ్ చేసి ఫామ్‌ను సబ్మిట్ చేయాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa