రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బుధవారం ఉదయం కృత్తివెన్ను మండలం పెదచందాల గ్రామంలో పర్యటించనున్నారు. గత ఏడాది రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన జనసేన క్రియాశీల సభ్యుడు చందు వీర వెంకట వసంతరాయలు కుటుంబాన్ని ఆయన పరామర్శించనున్నారు. ఈ మేరకు జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేసింది. పార్టీ నాయకులు పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa