AP: విశాఖపట్నం నుంచి గుంటూరు వెళ్తున్న సింహాద్రి ఎక్స్ప్రెస్లో పొగలు రావడంతో లోకో పైలట్ అప్రమత్తమై రైలును హంసవరంలో నిలిపివేశాడు. బ్రేక్ పట్టేయడంతో పొగలు వచ్చినట్లు సమాచారం. ఈ ఘటనతో రైలు దాదాపు 2 గంటల పాటు నిలిచిపోయింది. దీంతో పండుగ సెలవులు ముగిసి తిరుగు ప్రయాణంలో ఉన్న ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. కాగా, ఇటీవల కాలంలో ఎక్స్ ప్రెస్ రైళ్లు అగ్నిప్రమాదాలకు గురవుతుండటం ఆందోళన కలిగిస్తోంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa