ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూటమి ప్రభుత్వం బంపర్ ఆఫర్ ఇచ్చింది. ఇ-సైకిళ్లపై భారీ రాయితీ కల్పిస్తోంది. పర్యావరణ హితం కోసం ఈ ఇ- సైకిళ్లను పంపిణీ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు ఇప్పటికే ఈ-మోటోరాడ్స్ పరిశ్రమతో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. కాగా, ఈ సైకిళ్లు ఒక్కసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్ల దూరం ప్రయాణిస్తాయని అధికారులు తెలిపారు. అంతేకాకుండా ఈ సైకిళ్లను పంపిణీ చేయడంలో ఏపీ ప్రభుత్వం గిన్నిస్ రికార్డు సృష్టించింది. ఈ మేరకు సీఎం చంద్రబాబు చేతుల మీదుగా చిత్తురూ జిల్లా కలెక్టర్ గిన్నీస్ సర్టిఫికెట్ అందుకున్నారు.
రూ. 10 వేల రాయితీ..
ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గాన్ని పర్యావరణ హితంగా మార్చేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా ఇ- సైకిళ్లను అందించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో కుప్పం ప్రాంతంలో ఇ-సైకిళ్లను ప్రవేశపెట్టారు. వాస్తవానికి ఒక్కో సైకిల్ ధర రూ. 35 వేలుగా ఉంది. కానీ ప్రభుత్వం రూ. 10 వేల రాయితీ ఇస్తుండటంతో రూ. 25 వేలకే వీటిని సొంతం చేసుకోవచ్చు.
ఇ- సైకిళ్ల పంపిణీలో గిన్నీస్ రికార్డు..
కుప్పంలో జరిగిన ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు.. లబ్ధిదారులకు ఇ- సైకిళ్లు పంపిణీ చేశారు. తూంసీలోని ప్రజావేదిక వద్దకు దాదాపు 3 కిలోమీటర్ల ఇ-సైకిల్‌పై ర్యాలీగా చేరుకున్నారు సీఎం చంద్రబాబు. కాగా, కుప్పంలో 24 గంటల వ్యవధిలో 5,555 ఇ- సైకిళ్ల పంపిణీ చేపట్టి చిత్తూరు జిల్లా గిన్నిస్ రికార్డు సాధించింది. దీంతో సీఎం చంద్రబాబు చేతుల మీదుగా గిన్నిస్ రికార్డు పత్రాన్ని చిత్తూరు జిల్లా కలెక్టర్ అందుకున్నారు. కాగా, కుప్పంలోనే ఈ ఇ-సైకిళ్లను ఇ-మోటరాడ్ అనే సంస్థ అసెంబుల్ చేసినట్లు అధికారులు తెలిపారు.
ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు ప్రసంగించారు. కొత్త చరిత్రకు కుప్పం శ్రీకారం చుట్టిందని చెప్పారు. కుప్పంలో 5,555 ఇ-సైకిళ్లు పంపిణీ చేసి చరిత్ర సృష్టించామని తెలిపారు. అయితే గిన్నిస్ రికార్డు వచ్చిందని కాదని.. రాబోయే రోజుల్లో మరిన్ని ప్రయోజనాలు ఉంటాయని పేర్కొన్నారు. ఈ ఇ- సైకిళ్లకు ఇంటిపై ఉత్పత్తయ్యే విద్యుత్‌తోనే ఛార్జింగ్ చేసుకోవచ్చని.. ఈ సూపర్ సైకిల్ పైసా ఖర్చు లేకుండానే దూసుకెళ్తుందని చెప్పారు. ఎన్నికల్లో సైకిల్‌కు ఓటేశారని.. అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపించామని చెప్పారు సీఎం చంద్రబాబు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa