ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ప్రైవేట్‌ ట్రావెల్స్‌ బస్సు దగ్ధం.. 39 ప్రయాణికులకు తప్పిన ప్రమాదం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 07, 2026, 10:21 AM

ఎన్టీఆర్‌ జిల్లా నందిగామ వద్ద హైదరాబాద్‌ నుంచి విజయవాడ వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఇంజిన్‌లో మంటలు చెలరేగాయి. కంచికచర్ల మండలం కేసర టోల్‌గేట్‌ వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. 39 మంది ప్రయాణికులతో వెళ్తున్న బస్సు వెనుక భాగంలో పొగలు రావడంతో అప్రమత్తమైన డ్రైవర్ వెంటనే బస్సును ఆపాడు. ప్రయాణికులంతా సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. అనంతరం బస్సు ఇంజిన్ భాగం మంటల్లో కాలిపోయింది. ఘటనాస్థలికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు.బస్సు దగ్ధమవడంతో జాతీయ రహదారిపై ట్రాఫిక్ నిలిచిపోయింది. ట్రాఫిక్‌ను పోలీసులు క్లియర్ చేస్తున్నారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa