ట్రెండింగ్
Epaper    English    தமிழ்

45 ఏళ్ల క్రితం చేసిన దొంగతనం కేసులో ఇప్పుడు దొరికిన దొంగ

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:38 PM

సరిగ్గా 45 ఏళ్ల క్రితం కేవలం రూ.100 విలువైన గోధుమలు దొంగిలించిన కేసులో 65 ఏళ్ల వృద్ధుడిని మధ్యప్రదేశ్ పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. 1980లో జరిగిన ఈ సంఘటనలో ఇన్నేళ్ల పాటు పరారీలో ఉన్న నిందితుడిని ఎట్టకేలకు పట్టుకున్నారు.1980లో మధ్యప్రదేశ్‌లోని ఖర్గోన్ జిల్లా బల్కావాడ పోలీస్ స్టేషన్ పరిధిలో సలీం (అప్పటి వయసు 20) మరో ఆరుగురితో కలిసి పొలంలోకి చొరబడి రూ.100 విలువైన గోధుమలను దొంగిలించాడు. ఆ రోజుల్లో క్వింటాల్ గోధుమల ధర సుమారు రూ.115 ఉండేది. ఈ నేరం చేసిన వెంటనే సలీం తన కుటుంబంతో కలిసి గ్రామాన్ని విడిచి పక్కనే ఉన్న ధార్ జిల్లాకు పారిపోయాడు.అక్కడ బాగ్ ప్రాంతంలో ఓ చిన్న కిరాణా దుకాణం పెట్టుకుని సాధారణ జీవితం గడుపుతున్నాడు. తన పాత కేసు గురించి అందరూ మర్చిపోయి ఉంటారని, ఇక తనను ఎవరూ పట్టుకోలేరని భావించాడు. అయితే, రాష్ట్రవ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించేందుకు పోలీసులు చేపట్టిన ప్రత్యేక డ్రైవ్‌లో ఈ కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. పాత నిందితుల జాబితాను పరిశీలిస్తున్నప్పుడు సలీం ఆచూకీ గురించి పోలీసులకు కీలక సమాచారం అందింది.ఈ సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు, ధార్ జిల్లాలో నివసిస్తున్న సలీమ్‌ను శనివారం అరెస్ట్ చేశారు. అనంతరం కోర్టులో హాజరుపరచగా, న్యాయస్థానం అతనికి జ్యుడీషియల్ కస్టడీ విధించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa