ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆర్ఎస్ఎస్ ఉత్సవాల్లో పాల్గొన్న బాలీవుడ్ ప్రముఖులు

national |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:46 PM

ఆర్ఎస్ఎస్ శతాబ్ది ఉత్సవాల సందర్భంగా ముంబైలో నిర్వహించిన కార్యక్రమానికి పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు హాజరయ్యారు. సంస్థ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని విన్న తర్వాత, ఆయన ఆలోచనలు స్ఫూర్తిదాయకంగా ఉన్నాయని, సంస్థ ప్రయాణం ప్రశంసనీయమని వారు కొనియాడారు. ఈ కార్యక్రమం చాలా విషయాలపై తమకు అవగాహన కల్పించిందని అభిప్రాయపడ్డారు.ఈ వేడుకకు హాజరైన ప్రముఖ ఫిల్మ్ డైరెక్టర్ కరణ్ జొహార్ మాట్లాడుతూ... "ఆర్ఎస్ఎస్ శతాబ్ది వేడుకల్లో పాల్గొనడం చాలా ఆనందంగా ఉంది. మోహన్ భగవత్ గారి ఆలోచనలు వినడం ఎంతో స్ఫూర్తినిచ్చింది. బాలీవుడ్ ప్రముఖులకు ఇంత సమయం కేటాయించినందుకు ఆయనకు నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఆయనలో మంచి హాస్య చతురత కూడా ఉంది. మేమంతా ఎంతో సరదాగా గడిపాం" అని అన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa