ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమెరికా క్రికెట్ జట్టుకి శుభాకాంక్షలు తెలిపిన ట్రంప్

international |  Suryaa Desk  | Published : Mon, Feb 09, 2026, 02:39 PM

టీ20 ప్రపంచకప్ 2026 సందడి ఇప్పుడు అమెరికాను కూడా తాకింది. ఏకంగా ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ మెగా టోర్నీపై స్పందించడమే కాకుండా, తమ దేశ జట్టుకు మద్దతు ప్రకటించారు. ప్రస్తుతం భారత్, శ్రీలంక వేదికగా జరుగుతున్న ఈ ప్రపంచకప్‌లో అమెరికా జట్టుకు ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ 'ట్రూత్ సోషల్'లో ఒక పోస్ట్ చేశారు. "భారత్‌లో క్రికెట్ ప్రపంచకప్ జరుగుతోందని ఇప్పుడే విన్నాను. టీమ్ యూఎస్‌ఏకు నా శుభాకాంక్షలు. మనది చాలా బలమైన జట్టు. అమెరికా మొత్తం మీకు మద్దతుగా నిలుస్తుంది" అని ట్రంప్ పేర్కొన్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa