భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) చంద్రయాన్-4 మిషన్ కోసం సన్నాహాలు ప్రారంభించింది. చంద్రుడిపైకి భారత్ పంపబోయే అత్యంత సంక్లిష్టమైన మిషన్ చంద్రయాన్-4 కోసం ఇస్రో శాస్త్రవేత్తలు అప్పుడే రంగం సిద్ధం చేశారు. మిషన్ ప్రారంభానికి మరో రెండేళ్ల సమయం ఉండగానే, చంద్రుడి దక్షిణ ధ్రువంపై ల్యాండర్ దిగాల్సిన ఖచ్చితమైన స్థలాన్ని ఇస్రో గుర్తించింది. 2028 నాటికి ఈ మిషన్ ను పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. చంద్రుడి దక్షిణ ధ్రువంపై మాన్స్ మౌటన్ ప్రాంతంలోని ఎంఎం-4 అనే ప్రదేశాన్ని ల్యాండింగ్ కోసం ఇస్రో శాస్త్రవేత్తలు ఖచ్చితంగా గుర్తించారు. ఈ అత్యంత సంక్లిష్టమైన మిషన్ ద్వారా చంద్రుడిపై నుంచి మట్టి, రాళ్ల నమూనాలను భూమికి తీసుకురావడమే లక్ష్యం. ఇందులో ప్రొపల్షన్, డిసెండర్, అసెండర్, ట్రాన్స్ఫర్, రీ-ఎంట్రీ అనే ఐదు మాడ్యూల్స్ ఉంటాయి. ఈ మిషన్ విజయవంతమైతే, చంద్రుడి నుంచి నమూనాలను సేకరించిన అతికొద్ది దేశాలలో భారత్ ఒకటిగా నిలుస్తుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa