ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నేడు ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రితో సమావేశమైన చంద్రబాబు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:12 PM

చంద్రబాబు తన ఢిల్లీ పర్యటనలో భాగంగా మంగళవారం కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సి.ఆర్. పాటిల్‌తో ఆయన సమావేశమై, రాష్ట్రంలోని పలు సాగునీటి ప్రాజెక్టులకు అనుమతులు, ఆర్థిక సాయం అందించాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రయోజనాలు, రైతుల భవిష్యత్తు, తాగునీటి భద్రతకు ఈ ప్రాజెక్టులు ఎంతో ముఖ్యమని ఆయన కేంద్ర మంత్రికి సవివరంగా తెలియజేశారు.భేటీలో ప్రధానంగా రాష్ట్ర జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పలు అంశాలను ముఖ్యమంత్రి ప్రస్తావించారు. ప్రాజెక్టు పనులకు ఆటంకంగా ఉన్న "స్టాప్ వర్క్ ఆర్డర్‌"ను శాశ్వతంగా ఎత్తివేయాలని కోరారు. కుడి, ఎడమ కాలువల సామర్థ్యం పెంపు కారణంగా పెరిగిన వ్యయాన్ని రీయింబర్స్‌మెంట్ చేయాలని కోరారు. అలాగే, భూసేకరణ, పునరావాసం వంటి పనులు చేపట్టాల్సిన ఫేజ్-IIకు అదనంగా సుమారు రూ.32,000 కోట్ల నిధులు అవసరమని, వాటిని వెంటనే మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.అనంతరం, గోదావరి వరద జలాలను రాయలసీమ వంటి వర్షాభావ ప్రాంతాలకు తరలించే లక్ష్యంతో ప్రతిపాదించిన పోలవరం-నల్లమలసాగర్ లింక్ ప్రాజెక్టు గురించి వివరించారు. జాతీయ నదుల అనుసంధాన విధానంలో భాగంగా ఈ ప్రాజెక్టుకు అనుమతులు ఇచ్చి, సాంకేతిక, ఆర్థిక సహాయం అందించాలని కోరారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa