ప్రముఖ పారిశ్రామికవేత్త, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ తన ప్రతిష్ఠాత్మక లక్ష్యాలతో ప్రపంచాన్ని ఎప్పుడూ ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. తాజాగా ఆయన చంద్రుడిపై మానవ నాగరికత ఎలా ఉంటుందో చూపిస్తూ ఒక ఆసక్తికరమైన వీడియోను పంచుకున్నారు. "చంద్రుడిపై సివిలైజేషన్" అనే క్యాప్షన్‌తో ఈ వీడియోను షేర్ చేసి, తన భవిష్యత్ ప్రణాళికలపై కొత్త చర్చకు తెరలేపారు.అసలు విషయం ఏంటంటే, 'మూన్ 2042' పేరుతో గ్రోక్ ఏఐ రూపొందించిన ఒక వీడియోను @DogecoinNorway అనే యూజర్ ఎక్స్ (ట్విట్టర్)లో పోస్ట్ చేశారు. ఆ వీడియోనే మస్క్ తిరిగి షేర్ చేశారు. ఈ వీడియోలో చంద్రుడి ఉపరితలంపై డోమ్ ఆకారంలో భారీ నిర్మాణాలు, వాటి మధ్య స్వేచ్ఛగా తిరుగుతున్న వ్యోమగాములు, అత్యాధునిక టెస్లా వాహనాలు కనిపించాయి. అలాగే, ఆస్ట్రోనాట్ సూట్లలో చిన్నారులు ఆడుకుంటున్న దృశ్యాలు కూడా ఉన్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa