ట్రెండింగ్
Epaper    English    தமிழ்

80 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం అందుకున్న బ్రిటిష్‌ రచయిత్రి

national |  Suryaa Desk  | Published : Tue, Feb 10, 2026, 03:14 PM

బ్రిటిష్‌ రచయిత్రి, ఫొటోగ్రాఫర్‌, సాంస్కృతిక పరిశోధకురాలు, పద్మశ్రీ అవార్డు గ్రహీత పెపెతా సేఠ్‌ 80 ఏళ్ల వయసులో భారత పౌరసత్వం పొందారు. కేరళ త్రిశ్శూర్‌ కలెక్టరేట్‌లో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ అర్జున్‌ పాండ్యన్‌ ఆమెకు పౌరసత్వ పత్రాలు అందజేశారు. కేరళ సంస్కృతి, ఆచారాలు, ఉత్సవాలు, ప్రకృతి సౌందర్యాన్ని డాక్యుమెంటేషన్‌ చేస్తూ దాదాపు నాలుగు దశాబ్దాలుగా ఆమె భారత్‌లోనే నివసిస్తున్నారు. ఆమె సేవలను గుర్తించి 2012లో కేంద్ర ప్రభుత్వం ఆమెను పద్మశ్రీతో సత్కరించింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa