ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆరోపణలు చేయడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీయడమే

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Feb 11, 2026, 11:44 AM

నంద్యాల జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో తిరుమల లడ్డూ వివాదంపై వైయ‌స్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు, పాణ్యం మాజీ ఎమ్మెల్యే కాటసాని రామభూపాల్ రెడ్డి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఆయన టీడీపీ కూటమి తిరుమల శ్రీవారి ప్రసాదం అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం వక్రీకరిస్తోందని ఆరోపించారు.లడ్డూ తయారీలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు, పామాయిల్, కెమికల్స్ కలిశాయని చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ కూటమిదేనని ఆయన స్పష్టం చేశారు. సీబీఐ–సిట్ దర్యాప్తులో భాగంగా నిర్వహించిన ల్యాబ్ పరీక్షల్లో జంతువుల కొవ్వు లేనిదిగా స్పష్టమైందని తెలిపారు. అయినప్పటికీ ఆధారాలు లేకుండా ఆరోపణలు చేయడం భక్తుల విశ్వాసాలను దెబ్బతీసే చర్యగా పేర్కొన్నారు.2024లో చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాల చుట్టూనే ఈ కేసు తిరుగుతోందని కాటసాని వివరించారు. 2024 జూన్ 12, 21, 25 మరియు జులై 4 తేదీల్లో టీటీడీకి వచ్చిన నెయ్యి ట్యాంకర్లను స్థానిక టీటీడీ ల్యాబ్‌లో పరీక్షించి పాస్ చేసిన తర్వాతే వినియోగించారని చెప్పారు. అయితే జులై 6, జులై 12 తేదీల్లో వచ్చిన నాలుగు ట్యాంకర్ల నెయ్యి నాణ్యత ప్రమాణాలు లేకపోవడంతో టీటీడీ గోడౌన్ నుంచి తిరస్కరించి సంబంధిత కంపెనీకి మెయిల్ ద్వారా సమాచారం ఇచ్చినట్లు తెలిపారు.సీబీఐ–సిట్ ఛార్జిషీట్ల ప్రకారం జులై 25, 2024న తిరస్కరించిన నాలుగు ట్యాంకర్లను శ్రీకాళహస్తి సమీపంలో రాఘవేంద్ర స్టోన్ క్రషర్ వద్ద దాచిపెట్టి, అనంతరం అవే ట్యాంకర్లను దొడ్డిదారిన మళ్లీ టీటీడీకి పంపినట్లు దర్యాప్తులో తేలిందని వెల్లడించారు. ఈ ఘటనలన్నీ చంద్రబాబు హయాంలోనే జరిగాయని, అందువల్ల కల్తీ ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత టీడీపీ నాయకులదేనని ఆయన ప్రశ్నించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa