ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నరసరావుపేట నుంచి కోటప్పకొండకు బస్సుల టికెట్ ధరలు ఇవే..

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 03:51 PM

మహాశివరాత్రి జాతర సందర్భంగా పల్నాడు జిల్లావ్యాప్తంగా 618 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు జిల్లా రవాణా శాఖ అధికారి అజిత కుమారి శనివారం తెలిపారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని నరసరావుపేట నుంచి కోటప్పకొండ దిగువకు రూ. 25, అక్కడి నుంచి ఘాట్ రోడ్డు ద్వారా కొండపైకి రూ. 30 చొప్పున ధరలు నిర్ణయించారు. నేరుగా నరసరావుపేట నుంచి కొండపైకి వెళ్లే భక్తులకు రూ. 55 టికెట్ ధరగా ఖరారు చేశారు.కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవేసేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రత్యేక బస్సుల్లోనూ స్త్రీ శక్తి పథకం అమలవుతుందని వివరించారు. కోటప్పకొండ దిగువ నుంచి పైకి భక్తులను చేరవే సేందుకు 95 బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఈ ఏడాది కోటప్పకొండ నుంచి నరసరావుపేటకు తిరుగు ప్రయాణంలో బస్‌స్టేషన్‌ను పెట్లూరివారిపాలెం రోడ్డు మార్గంలో ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు.మరోవైపు శ్రీశైలంలో జరుగుతున్న మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల కోసం కూడా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. కర్నూలు జిల్లాలోని ఐదు డిపోల నుంచి శ్రీశైలానికి ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. కర్నూలు బస్టాండ్‌లో భక్తుల కోసం ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేయడమే కాకుండా పెరిగిన ఎండల తీవ్రత దృష్ట్యా మంచినీటి సౌకర్యాన్ని కూడా కల్పించారు.


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa