ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గిన్నిస్ రికార్డు లో చోటు దక్కించుకున్న ఖరీదైన బియ్యం

international |  Suryaa Desk  | Published : Sat, Feb 14, 2026, 03:57 PM

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన బియ్యం జపాన్‌లో పండుతోంది. కిన్మెమై ప్రీమియం బియ్యం పేరుతో పిలువబడే ఈ రకం, గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం సంపాదించింది. దీని ధర కిలోకు 12,500 నుండి 15,000 రూపాయల వరకు పలుకుతుంది. జపాన్ టోయో రైస్ కార్పొరేషన్ మాత్రమే ఉత్పత్తి చేసే ఈ బియ్యం, అధిక పోషకాలతో కూడుకున్నది. ఇందులో సాధారణ బియ్యం కంటే ఆరు రెట్లు ఎక్కువ లిపోపాలిసాకరైడ్లు (LPS) ఉంటాయి, ఇది శరీర రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఈ బియ్యాన్ని వండడానికి కడగవలసిన అవసరం లేదు.ఈ బియ్యం మరో ప్రత్యేకత ఏమిటంటే.. వండే ముందు దీన్ని కడగాల్సిన అవసరం ఉండదు. సాధారణంగా మార్కెట్లో లభించే బియ్యం వడ్ల పొరలను పూర్తిగా తొలగించడంతో కొంత రుచి, పోషకాలు తగ్గిపోతాయి. కానీ కిన్మెమై ప్రీమియంలో ధాన్యం లోపలి పోషక విలువలు అలాగే ఉండేలా తయారు చేస్తారు. ఫలితంగా ఈ బియ్యం తేలికగా జీర్ణమవుతుంది, శరీరానికి శక్తినిస్తుంది. జపాన్ మాత్రమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న విలాసవంతమైన హోటళ్లు, ఆరోగ్య ప్రియులు ఈ బియ్యాన్ని ఉపయోగిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa