ఏపీ ఆర్థిక మంత్రి అసెంబ్లీలో 2026-2027 బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్లో సూపర్ సిక్స్ హామీల్లో భాగంగా ప్రకటించిన తల్లికి వందనం పథకానికి నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి ప్రకటించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి ఈ ఆర్థిక సంవత్సరంలో (2026-2027) రూ.9,668 కోట్లు కేటాయించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో సమగ్ర, ఫలితాలపై దృష్టి పెట్టామని మంత్రి తెలిపారు. తల్లికి వందనం, మన బడి-మన భవిషత్తు, డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం, పారిశుధ్యం, నిర్వహణ నిధులు, పాఠ్య ప్రణాళిక మార్పులు, డిజిటల్ లెర్నింగ్, ఉపాధ్యాయుల సామర్థ్య వృద్ధి, పరిపాలనా పునర్వ్యవస్థీకరణ వంటి ప్రధాన కార్యక్రమాల ద్వారా అభ్యసన సామర్ధ్యాలను ఫలితాలను గ్లోబల్ పోటీతత్వాన్ని మెరుగుపరచడంపై ఫోకస్ పెట్టామన్నారు. “లెర్షింగ్ ఎక్టలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ Leap కింద కేజీ టు పీజీ విద్యా సంస్కరణ నమూనాను ప్రారంభించామన్నారు.
2026-27 ఆర్థిక సంవత్సరానికి పాఠశాల విద్యాశాఖకు రూ. 32,308 కోట్లు, అందులో ప్రజా పాఠశాలల మౌలిక వసతుల సమగ్ర అభివృద్ధికి రూ.1,500 కోట్లు. ఉన్నత విద్యాశాఖకు రూ.2,567 కోట్లు. నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖకు రూ.1,232 కోట్లు. సూపర్ సిక్స్ కార్యక్రమంలో భాగంగా 2025-26లో ప్రవేశపెట్టిన “తల్లికి వందనం” పథకం కింద ప్రతి విద్యార్థికి సంవత్సరానికి రూ.15,000 చొప్పున అందజేసి.. 67.27 లక్షల మంది విద్యార్థులకు లాభం చేకూర్చాము. పరిపాలనా పారదర్శకతను మెగా పేరెంట్-టీచర్ సమావేశాలు, పాఠశాల స్టార్ రేటింగ్ వ్యవస్థ, సమాజ భాగస్వామ్యం ద్వారా బలోపేతం చేశాము' అన్నారు.
'అనేక సంవత్సరాలుగా వేలాది ఉపాధ్యాయ పోస్టులు ఖాళీగా ఉండేవి. మెగా డీఎస్సీ-2025 ద్వారా నోటిఫై చేసిన 16,347 పోస్టుల్లో 15,941 ఉపాధ్యాయ పోస్టులను విజయవంతంగా భర్తీ చేశాము. భవిప్వత్ ఉపాధి అవసరాలకు అనుగుణంగా సమగ్ర నైపుణ్యాభివృద్ధి వ్యవస్థను రూపవొందిస్తున్నాము. విద్య, పరిశ్రమలు, అభివృద్ధి చెందుతున్న సాంకేతిక రంగాల మధ్య సమన్వయంపై దృష్టి సారిస్తున్నాము. ప్రత్యక్ష అనుభవాన్ని కల్పించేందుకు అన్ని ప్రభుత్వ ఐ.టీ.ఐ.లు 167 పరిశ్రమ భాగస్వాములతో అవగాహన బప్పందాలు కుదుర్చుకున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో 9,188 మంది శిక్షణార్థులు పరిశ్రమల్లో ప్రత్యక్ష శిక్షణ పొందగా, ప్రభుత్వ ఐటీఐ విద్యార్థుల్లో 98 శాతం మంది నియామకాలు లేదా అప్రెంటిస్ అవకాశాలను పొందారు' అని మంత్రి కేశవ్ తెలిపారు. కూటమి ప్రభుత్వం 2024 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం విద్యార్థులకు తల్లికి వందనం పథకం కింద ఒక్కో విద్యార్థికి రూ.15వేల చొప్పున అందజేస్తోంది. గతేడాది ఈ పథకాన్ని అమలు చేసింది. ఈ ఏడాది కూడా అమలు చేసేందుకు బడ్జెట్లో కేటాయింపులు చేశారు. వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ప్రారంభయ్యే సమయంలో ఈ డబ్బుల్ని విడుదల చేయనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa