మేషం: చిన్ననాటి మిత్రులతో విందు వినోదాది కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. ఇంటా బయట బాధ్యతలు సమర్థంగా నిర్వహిస్తారు. వృత్తి వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు ఆశించిన స్థాన చలనాలున్నవి.
వృషభం: దూరప్రయాణాలలో మార్గ అవరోదాలు కలుగుతాయి ఇంటాబయట సమస్యలు చికాకు పరుస్తాయి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. బంధువులతో స్వల్ప వివాదాలు ఉంటాయి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగులు అధికారుల ఆగ్రహానికి గురవుతారు.
మిధునం: చేపట్టిన వ్యవహారాలలో మీ శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. దూరపు బంధువుల నుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. చిన్ననాటి మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తిచేస్తారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగులకు పదోన్నతులు పెరుగుతాయి.
కర్కాటకం: సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది. నిరుద్యోగ ప్రయత్నాలు సానుకూలమవుతాయి. దైవ చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఉద్యోగమున అధికారుల నుండి ప్రశంసలు అందుకుంటారు.
సింహం: కీలక వ్యవహారాలలో స్వంత ఆలోచనలు అమలు చెయ్యడం మంచిది. ఆర్థిక ఇబ్బందులు వలన నూతన ఋణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. ఉద్యోగస్తులకు విధుల్లో సమస్యలు తప్పవు.బంధు వర్గంతో విభేదాలు కలుగుతాయి.
కన్య: దూర ప్రయాణ సూచనలున్నవి.స్థిరస్తి ఒప్పందాలలో అవాంతరాలు కలుగుతాయి. చేపట్టిన పనులు మందగిస్తాయి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. నిరుద్యోగ ప్రయత్నాలు అంతగా ఫలించవు ఉద్యోగులకు సహోద్యోగులతో మాటపట్టింపులు కలుగుతాయి.
తుల: చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలకు లోటుండదు. సోదరులతో స్థిరస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. వృత్తి, వ్యాపారాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
వృశ్చికం: సమాజంలో ప్రముఖుల నుండి వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనుల్లో మరింత పురోగతి సాధిస్తారు.మిత్రుల నుంచి వివాహ శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణిస్తాయి. ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి.
ధనస్సు: ముఖ్యమైన పనులు మందగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి వ్యాపారాలు కొంత నిరుత్సాహపరుస్తాయి ఉద్యోగులకు పనిఒత్తిడి పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందుల వలన మానసిక సమస్యలు కలుగుతాయి. నిరుద్యోగులు మరింత కష్టపడాలి. వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు.
మకరం: ధన వ్యవహారాలలో జాగ్రత్త అవసరం. వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి. ఉద్యోగులకు అదనపు పనిభారం పెరుగుతుంది. స్థిరస్తి వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చెయ్యడం మంచిది కాదు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.
కుంభం:సన్నిహితుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగవకాశాలు లభిస్తాయి.నూతన వ్యాపార ప్రారంభానికి పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగమున సమస్యలు అదిగమించి దైర్యంగా ముందుకు సాగుతారు. ధనాదాయ మార్గాలు పెరుగుతాయి.
మీనం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభానికి అవరోధాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులతో పుణ్యక్షేత్రాలు దర్శించుకుంటారు. వ్యాపారాలలో భాగస్థులతో చిన్నపాటి వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు కలసిరావు. నూతన ఋణ ప్రయత్నాలు చెయ్యకపోవడం మంచిది.