అక్రమంగా మద్యం విక్రయిస్తున్న వారిపై స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అధికారులు దాడులు నిర్వహించారు. అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ఇరువురుని అదుపులోకి తీసుకున్న సంఘటన పట్టణంలోని ఇసుకపల్లి, పేటేరులలో చోటు చేసుకుంది. సెబ్ సీఐ లీనా ఆధ్వర్యంలో సిబ్బంది ఇసుకపల్లిలో దాడులు నిర్వహించారు. పి. ఏసురత్నం అనే మహిళ అక్రమంగా మద్యంను విక్రయిస్తూ పట్టుబడిందన్నారు. ఆమె వద్ద నుంచి 8 మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పేటేరు గ్రామంలో దాడులు నిర్వహించగా ఆలపాటి మల్లేశ్వరమ్మ అనే మహిళ మద్యం సీసాలు విక్రయిస్తూ పట్టుబడిందన్నారు. ఆమె వద్ద నుంచి 20 మద్యం సీసాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. వీరిని రిమాండ్ కు పంపినట్లు తెలిపారు. ఎవరైనా అక్రమంగా మద్యంను విక్రయిస్తే స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ సిబ్బందికి సమాచారం అందించాలని తెలిపారు. సమాచారం అందించిన వారి వివరాలను గోప్యంగా ఉంచుతామని తెలిపారు.