మేషం: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి కొంత బాధిస్తుంది బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం వ్యాపార, ఉద్యోగాలు మందగిస్తాయి.
వృషభం: నూతన ఋణ ప్రయత్నాలు చేస్తారు. వృత్తి ఉద్యోగాలలో కష్టం తప్ప ఫలితం కనిపించదు.ముఖ్యమైన పనులు వాయిదా వేస్తారు. బంధు వర్గంతో మాట పట్టింపులుంటాయి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధికామౌతాయి.
మిధునం: ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి. చేజారిన వస్తువులు తిరిగి పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు కలసివస్తాయి. చేపట్టిన పనులలో యత్నకార్యసిద్ధి కలుగుతుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు లాభసాటిగా సాగుతాయి.
కర్కాటకం: చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఉంటాయి. ఆర్థిక ఇబ్బందులు కొంత చికాకు పరుస్తాయి. దూరప్రయాణ సూచనలున్నవి. కుటుంబసభ్యుల నుంచి ఒత్తిడులు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో ఆలయాలు సందర్శిస్తారు. ఆరోగ్య విషయంలో శ్రద్ద అవసరం. వృత్తి, వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి.
సింహం: నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్ కు ఉపయోగపడతాయి.కుటుంబ సభ్యులతో శుభకార్యలకు హాజరువుతారు గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. విలువైన వస్తువులు సేకరిస్తారు. సంతానానికి నూతన విద్యా ఉద్యోగ అవకాశములు అందుతాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి.
కన్య: చేపట్టిన పనులు వాయిదా వేస్తారు. కుటుంబ వ్యవహారాలలో ఆలోచనలు నిలకడగా ఉండవు. ఉద్యోగమున ఇతరులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.ఇంటా బయట పరిస్థితులు ప్రతికూలిస్తాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త అవసరం. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తప్పవు.
తుల: నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు వ్యాపారమున స్వంత ఆలోచనలు అమలు చేస్తారు. విలువైన వస్తు లాభాలు పొందుతారు. శత్రువులు సైతం మిత్రులుగా మారతారు. పుణ్యక్షేత్ర దర్శనాలు చేసుకుంటారు. ఆకస్మిక ధన లాభ సూచనలున్నవి ఉద్యోగమున నూతన ప్రోత్సాహకాలు అందుతాయి.
వృశ్చికం: నూతన విషయాలు సేకరిస్తారు. ఉద్యోగమున ప్రతిభకు తగిన గుర్తింపు పొందుతారు. ఆర్థిక పరిస్థితి అనుకూలస్తుంది. నూతన కార్యక్రమాలు చేపడతారు. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఊహించని మార్పులు ఉంటాయి.
ధనస్సు: చేపట్టిన పనులలో ఆటంకాలు ఉంటాయి. వృధాఖర్చులు పెరుగుతాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా వ్యవహారించాలి. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. ఉద్యోగమున శ్రమాదిక్యత పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి.
మకరం: దీర్ఘకాలిక సమస్యలు చికాకు పరుస్తాయి. చేపట్టిన పనులు మందకోడిగా సాగుతాయి దూరప్రయాణాలు వాయిదా వెయ్యడం మంచిది. కుటుంబసభ్యులతో మాటపట్టింపులుంటాయి. వ్యాపార, ఉద్యోగాలు అంతంత మాత్రంగా సాగుతాయి దైవ చింతన పెరుగుతుంది.
కుంభం: దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు కలుగుతాయి. రాజకీయ సభ, సమావేశాలలో పాల్గొంటారు. మొండి బాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు అనుకూలంగా సాగుతాయి , ఉద్యోగ వాతావరణం ప్రశాంతంగా ఉంటుంది.
మీనం: చేపట్టిన పనులలో శ్రమ ఫలిస్తుంది. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు. ఆప్తుల నుంచి ధన సహాయం అందుతుంది. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారాలు లాభిస్తాయి. నిరుద్యోగులకు నూతన ఉద్యోగావకాశములు అందుతాయి.