ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డిఈఈ) సెట్-2021 రెండో విడత కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా సర్టిఫికెట్ల పరిశీలన కొనసాగుతుందని రాజమండ్రి రూరల్ బొమ్మూరులోని ప్రభుత్వ జిల్లా విద్యాశిక్షణా (డైట్) సంస్థ ప్రిన్సిపాల్ సుబ్రహ్మణ్యం సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన అభ్యర్థులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో బొమ్మూరు డైట్ కు కేటాయించిన తేదీల్లో హాజరు కావాలని సూచించారు. సర్టిఫికెట్ల పరిశీలన అనంతరం అడ్మిషన్ లెటర్ పొందాలని ప్రిన్సిపాల్ తెలిపారు. ఈ నెల 25 నుంచి తరగతులు ప్రారంభమవుతాయన్నారు.