సలేశ్వరం లింగమయ్య దర్శనానికి మొదటి రోజు శుక్రవారం సాయంత్రం 6 గంటల సమయానికి 4వేలకు పైగా వాహనాలు తరలివెళ్లాయని అటవీశాఖ అధికారులు తెలిపారు. కార్లు, ఆటోలు, ట్రాక్టర్, డీసీఎంలు 2400, ద్విచక్రవాహనాలు 1500, ఆర్టీసీ బస్సులు 35 ట్రిప్పులు తిరిగాయని, ఈ వాహనాల రాకపోకల ద్వారా 20వేలకు పైగా భక్తులు లింగమయ్య దర్శనానికి వెళ్లినట్లుగా తెలుస్తోంది. అడవిలో వాహనాలు వెళ్లినందుకు గాను అటవీ శాఖకు టోల్‌గేట్ రుసుములు మొదటి రోజు రూ.2 లక్షలు వసూలయ్యాయి. రాత్రివేళలో అనుమతులు లేకపోవడంతో భక్తుల రద్దీ ఈ ఏడాది తగ్గింది.