మేషం: ప్రముఖులతో పరిచయాలు సంతోషం కలిగిస్తాయి. ఇంటా బయట ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటుచేసుకుంటాయి. పనులు చకచకా సాగుతాయి. స్థిరస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. వ్యాపార, ఉద్యోగాలలో ఒడిదుడుకులు అధిగమిస్తారు.
వృషభం: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలు మధ్యలో వాహన ఇబ్బందులు కలుగుతాయి. ఆరోగ్య ఈ విషయంలో కొంత శ్రద్ధ వహించాలి వృధా ఖర్చులు పెరుగుతాయి. దైవచింతన కలుగుతుంది. ఉద్యోగాలు అంతగా అనుకూలించవు. వ్యాపారాలు అధిక కష్టంతో అల్ప ఫలితాన్ని పొందుతారు.
మిధునం: గృహమున బాధ్యతలు చికాకు పరుస్తాయి. ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉంటుంది. బంధుమిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగుల ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. వ్యాపారమున ఆలోచించి ముందుకు సాగడం మంచిది. ఉద్యోగాలు కొంత గందరగోళంగా ఉంటాయి.
కర్కాటకం: ముఖ్యమైన వ్యవహారాలలో ఆటంకాలు తొలగుతాయి. ఆకస్మిక ధనలాభ సూచనలు ఉన్నవి. నూతన పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. ఎంతటి వారినైనా మీ మాట తీరుతో ఆకట్టుకుంటారు. వ్యాపార వ్యవహారాలు ఉత్సాహంగా సాగుతాయి, ఉద్యోగులకు అధికారుల అండదండలు లభిస్తాయి.
సింహం: సమాజంలో ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి. ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆర్థిక పరిస్థితులు అనుకూలిస్తాయి. విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. మిత్రుల కలయిక ఆనందం కలిగిస్తుంది. ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు.
కన్య: దీర్ఘకాలిక రుణబాధలు తొలగుతాయి. ఉద్యోగులకు నూతన ఉద్యోగయోగం ఉన్నది. కుటుంబ విషయంలో ముఖ్య నిర్ణయాలు తీసుకుంటారు. చేపట్టిన వ్యవహారాలు సాఫీగా సాగుతాయి. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. ఉద్యోగాలలో ఆశించిన స్థానం చలనాలు కలుగుతాయి.
తుల: మిత్రుల నుంచి రుణ ఒత్తిడి అధికమవుతుంది. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. ఆకస్మిక ప్రయాణ నువ్వు చాలా ఉన్నవి. ఆరోగ్య విషయంలో కొంత జాగ్రత్త వహించాలి. ముఖ్యమైన పనులు వాయిదా పడతాయి. వ్యాపార, ఉద్యోగాలు గందరగోళంగా సాగుతాయి.
వృశ్చికం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అధిక శ్రమతో కానీ గాని పనులు పూర్తి కావు. ముఖ్యమైన కార్యక్రమాలలో అవాంతరాలు కలుగుతాయి. దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. స్వల్ప అనారోగ్య సమస్యలు ఉంటాయి. వ్యాపార, ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి.
ధనస్సు: మిత్రులతో సఖ్యత నెలకొంటుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు. ఉద్యోగాలు మరింత అనుకూలంగా సాగుతాయి.
మకరం: చేపట్టిన పనులు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి. వృత్తి వ్యాపారాలలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. స్వల్ప అనారోగ్య సమస్యలు బాధిస్తాయి బంధువుల నుంచి ఋణ ఒత్తిడులు పెరుగుతాయి. ఉద్యోగాలలో శ్రమ మరింత అధికం అవుతుంది.
కుంభం: చేపట్టిన పనుల్లో విజయం సాధిస్తారు. దూరపు బంధువుల నుండి అందిన శుభవార్తలు ఉత్సాహాన్నిస్తాయి. సోదరులతో భూవివాదాలు కొలిక్కి వస్తాయి. నిరుద్యోగుల కలలు ఫలిస్తాయి. వ్యాపార, ఉద్యోగాలలో పని ఒత్తిడి నుండి ఉపశమనం లభిస్తుంది. దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు.
మీనం: చేపట్టిన పనులు నత్తనడకన సాగుతాయి. ఆర్థిక ఇబ్బందులు చికాకు పరుస్తాయి. నూతన ఋణ యత్నాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి. మిత్రులతో స్వల్ప వివాదాలు కలుగుతాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టకపోవడం మంచిది. ఉద్యోగాలలో ఊహించని సమస్యలు కలుగుతాయి.