దేశంలో ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమైంది. మళ్లీ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయాలని ఆదేశించినట్లు వైద్యులు తెలిపారు. ప్రతి పీహెచ్ సి పట్టణ ఆరోగ్య కేంద్రాలలో ప్రతిరోజూ 10 నుంచి 15 నమూనాలు సేకరించాలని సంబంధిత వైద్యాధికారులకు సూచించింది. ఈ పరీక్షల నిర్వహణకు యంత్రాంగం చర్యలు తీసుకుంటోంది.
కిట్లు, ఇతర సామాగ్రిని మరింత అందజేసేందుకు ఉన్నతాధికారులు తెలిపారని స్థానిక వైద్యులు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటా జ్వరాల సర్వే ప్రారంభం అయిందని దాని నిర్వాహణకు ఏఎన్ఎం ఆశ కార్యకర్తలు ప్రతి ఇంటికీ వెళ్తారు. ఈ సర్వేలో భాగంగా కరోనా అనుమానిత లక్షణాలు, జ్వరం, జలుబు, దగ్గు, శరీర నొప్పులతో ఎవరైనా బాధపడుతుంటే వారిని గుర్తించి వెంటనే ఆర్టీపీసీఆర్ యాంటిజెన్ కిట్లతో పరీక్షలు చేసి నమూనాలు ల్యాబు పంపాలని వైద్యాధికారులకు సూచించారన్నారు.
జిల్లాలో కేసులు లేకపోయినా తాజాగా ఒక రోజు ఒకటి రెండు కేసులుంటే ఒకసారి అవి మూడు నాలుగు కూడా వస్తుంటాయి. నిత్యం ఎన్ని నమూనాలు తీశారు. వాటిని ల్యాబ్ కు పంపగా వచ్చిన పాజిటివ్, నెగిటివ్ వివరాలను డివిజనల్ అధికారులకు పంపాలన్నారు. డీఎంహెచ్ఓ కార్యాలయానికి వారు పంపుతారన్నారు. యాంటిజెన్ టెస్ట్ ఫలితాలు వెంటనే వస్తాయి. కానీ ఆర్టీపీసీఆర్ ఫలితం 24 గంటల తరువాత వస్తుంది. కచ్చితంగా ఆ పరీక్ష నమూనాలు జిల్లా ఆసుపత్రికి పంపాల్సి ఉంటుంది. దీనిపై వైద్యాధికారులు సీరియస్ గా పరిగణించాలన్నారు. హిందూపురంలో ప్రభుత్వ ఆసుప త్రిలో నిత్యం పరీక్షలు జరుగుతూనే ఉన్నాయని డా అనంద్బాబు తెలిపారు.