మేషం: అవసరానికి స్నేహితుల నుండి సహాయం లభిస్తుంది. చేపట్టిన వ్యవహారాల్లో విజయం పొందుతారు. శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. మొండి బాకీలు వసూలు అవుతాయి. సంతానం విద్యా విషయాలలో ఉత్తమ ఫలితాలు పొందుతారు. వృత్తి ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి.
వృషభం: ఆర్థికంగా మరింత ఉత్సాహంగా ఉంటారు. సమాజంలో పరిచయాలు మరింత విస్తృతం అవుతాయి. గృహమున కొన్ని సంఘటనలు ఆశ్చర్యం కలిగిస్తాయి. వ్యాపార ఉద్యోగాలలో అప్రయత్నంగా అవకాశాలు పొందుతారు. నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.
మిధునం: చిన్న చిన్న విషయాలు మనసుకు బాధ కలిగిస్తాయి. ధన వ్యవహారాలు ఒడిదుడుకుగా ఉంటాయి. కుటుంబ సభ్యుల మధ్య మాటలు వివాదాస్పదంగా మారుతాయి. దూరప్రయాణం సూచనలు ఉన్నవి. ఉద్యోగాల్లో వివాదాలు కలుగుతాయి. దైవ చింతన పెరుగుతుంది.
కర్కాటకం: కొత్త బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనులలో శ్రమ తప్ప ఫలితం కనిపించదు. ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నవి. వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి. ఆర్థికంగాపరిస్థితి మరింత నిరుత్సాహ పరుస్తుంది. సోదరులతో సమన్వయం లోపిస్తుంది.
సింహం: చేపట్టిన వ్యవహారాలలో అనుకూలత పెరుగుతుంది. సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో నూతన పరిచయాలు లాభం కలిగిస్తాయి. రావలసిన ధనం సమయానికి అందుతుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో సత్ఫలితాలు పొందుతారు.
కన్య: చిన్ననాటి మిత్రులతో శుభకార్యాలకు హాజరవుతారు. వృత్తి ఉద్యోగాలలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారిస్తారు. కొన్ని వ్యవహారాలలో అనుకున్నవిధంగా పూర్తిచేస్తారు. వ్యాపార ఉద్యోగాలు సజావుగా సాగుతాయి.
తుల: చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. ఆర్థికంగా రుణ ప్రయత్నాలు కలసిరావు. ఇంటా బయట ప్రతికూల వాతావరణం ఉంటుంది. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించాలి. వృత్తి ఉద్యోగాలు నిదానంగా సాగుతాయి. వృధా ఖర్చులు ఉంటాయి. నూతన వ్యాపారాలలో స్వల్ప లాభాలు పొందుతారు.
వృశ్చికం: కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. వృత్తి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు ఒత్తిడి కలిగిస్తాయి. ధన వ్యయసూచనలుఉన్నవి. స్థిరాస్తి వివాదాల లో రాజీ ప్రయత్నాలు విఫలం అవుతాయి. ముఖ్యమైన పనులు వ్యయ ప్రయాసలతో కానీ పూర్తి కావు.
ధనస్సు: నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలులభిస్తాయి. వాహన కొనుగోలుకు ఆటంకాలు తొలగుతాయి. వ్యాపారం పురోగతి కలుగుతుంది. సంతానం విద్యా విషయాలలో శుభవార్తలు అందుతాయి. ఆర్ధిక వ్యవహారాలు సంతృప్తినిస్తాయి. దీర్ఘకాలిక ఋణాలు తీరుస్తారు.
మకరం: పాత రుణాలను తీర్చడానికి కొత్త రుణాలు చేస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులెదురవుతాయి. ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరం అవుతాయి. పుణ్య క్షేత్రాలను సందర్శిస్తారు. వ్యాపార ఉద్యోగాలలో ప్రతికూలత పెరుగుతుంది.
కుంభం: చేపట్టిన పనులు బంధుమిత్రుల సహాయ సహకారంతో సజావుగా పూర్తి చేయగలుగుతారు. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నాలు కలసివస్తాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార పరంగా నూతన ప్రణాళికలను అమలు పరిచి విజయం సాధిస్తారు.
మీనం: వృత్తి వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ విషయంలో పెద్దల సలహాలు తీసుకుని ముందుకు సాగడం మంచిది. ఆకస్మిక ప్రయాణం సూచనలు ఉన్నవి. ఆర్థికంగా కొంత ఇబ్బంది తప్పదు. సమాజంలో కొందరు ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.