పల్నాడు జిల్లా ఎస్పీ శ్రీ రవిశంకర్ రెడ్డి ఐపీఎస్ గారి., ఆధ్వర్యంలో స్థానిక నరసరావుపేట డీఎస్పీ కార్యాలయ ఆవరణలో నిర్వహించిన స్పందనా కార్యక్రమంలో ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించిన దిశా డిఎస్పీ రవిచంద్ర మరియు ఎస్బి డిఎస్పీ కమలాకర్ . సోమవారం స్పందనా కార్యక్రమానికి ప్రజల నుండి 75 ఫిర్యాదులు రావడం జరిగినదని,సదరు ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించవలసినదిగా ఫోన్ ద్వారా సంబంధిత పోలీస్ అధికారులను ఆదేశించడం జరిగినదని శ్రీ ఎస్పీ గారు తెలిపారు. ఈ వారం స్పందనా కార్యక్రమానికి నగదు లావాదేవీలు,ఆస్తి తగాదాలు,కుటుంబ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా రావడం జరిగినదని తెలిపారు. కొన్ని నగదు లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదులను పరిశీలించగా, ఫిర్యాదు దారులు ఎక్కువ వడ్డీకి ఆశపడి నగదు అప్పు ఇచ్చి మోసపోయినట్లు తెలుస్తుంది కావున ప్రజలు ఎక్కువ వడ్డీకి ఆశపడి, నగదు అప్పుఇచ్చి మోసపోవద్దు అని హితవు పలికారు. స్పందనా కార్యక్రమానికి హాజరైన ప్రజలు తమ ఫిర్యాదులను వ్రాసుకోవడంలో పోలీస్ సిబ్బంది తమ సహకారాన్ని అందించినారు. స్పందనా కార్యక్రమానికి హాజరైన ప్రజలకు భోజన సదుపాయాలను పోలీస్ అధికారులు కల్పించినారు. ఈ కార్యక్రమంలో శ్రీ ఎస్పీగారు, డీఎస్పీ గారులతో పాటు పల్నాడు జిల్లా స్పెషల్ బ్రాంచ్ సీఐ విజయ చంద్ర గారు పాల్గొన్నారు.