యాదగిరిగుట్ట ప్రముఖ పుణ్యక్షేత్రమైన యాదగిరి నరసింహుని సన్నిధిలో శనివారం భక్తుల రద్దీ నెలకొన్నది. స్వామివారి దర్శనానికి భక్తులు భారీగా తరలి రావడంతో అంత ట జనసందోహం నెలకొన్నది. క్యూలైన్లలో బారులు తీరారు, ఎండ తీవ్రత ఎక్కువగా ఉండడం, కొండపై ఎక్కడ నిలువ నీడ లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కనీసం తాగడానికి మంచినీరు అందించడంలో కూడా అధికారులు విఫలం కావడంతో భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.