ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఏపీలో జాబ్ నోటిఫికేషన్ విడుదల

Education |  Suryaa Desk  | Published : Tue, May 10, 2022, 01:16 PM

ఏపీలో వైద్య, ఆరోగ్య శాఖ పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనిచేయడానికి 31 (ఓపెన్‌ కేటగిరి) సివిల్‌ అసిస్టెంట్‌ సర్జన్‌ పోస్టుల భర్తీకి సోమవారం నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. ఎంబీబీఎస్‌ విద్యార్హత కలిగి, మెడికల్‌ కౌన్సిల్‌ లో నమోదు చేసుకోవడంతో పాటు, గత ఏడాది జూలై 1వ తేదీ నాటికి 42 ఏళ్ల వయస్సు మించని వారు ఈ పోస్టులకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు మూడేళ్లు, శారీరక వికలాంగులకు పదేళ్లు, ఎక్స్‌సర్వీస్‌మెన్‌ కేటగిరీ వారికి మూడేళ్ల వయస్సు సడలింపు ఉంటుంది. ఈ ఉద్యోగాలకు మంగళవారం నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు చేసుకోవచ్చు. ఈ నెల 19వ తేదీ సా.5.30 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలి.
వెబ్ సైట్: http://hmfw.ap.gov.in/
దరఖాస్తు చేసుకునేందుకు లాస్ట్ డేట్: మే 19, 2022.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com