అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గంలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాల కోసం రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మెగా జాబ్ మేళా ను విజయవంతం చేయాలని ఎంపీడీవో దివాకర్ రెడ్డి తెలిపారు.
ఆయన పంచాయతీ కార్యదర్శుల తో మాట్లాడుతూ ప్రతి గ్రామ సచివాలయం పరిధిలో నిరుద్యోగులను గుర్తించి జాబ్ మేళా కు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేలా చొరవ చూపాలన్నారు. దరఖాస్తుదారులను బీ. కొత్తకోట ఉన్నత పాఠశాల ఆవరణంలో ఈనెల 30వ తేదీ జరిగే మెగా జాబ్ మేళా హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.