ఎనిమిదేళ్లుగా నిరీక్షిస్తున్న యువతకు ఎట్టకేలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ అందిస్తోంది. వరుసగా వివిధ శాఖల్లో ఖాళీ ఉద్యోగాల భర్తీకి చర్యలు తీసుకుంటోంది. ఈ క్రమంలో నిరుద్యోగులకు మరో గుడ్ న్యూస్ త్వరలో ప్రభుత్వం అందించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ఇరిగేషన్ శాఖలో 1,583 పోస్టుల భర్తీకి చర్యలు వేగవంతం చేసింది. ఇందులో భాగంగా సివిల్, ఎలక్ట్రికల్, అగ్రికల్చర్, మెకానికల్ విభాగాల్లో 704 ఏఈఈ పోస్టుల భర్తీకి ప్రతిపాదనలు సిద్ధం అయ్యాయి. ఇరిగేషన్ విభాగం నుంచి ఇప్పటికే ప్రభుత్వానికి పోస్టుల భర్తీ విషయంపై ప్రతిపాదనలు అందాయి. వీటికి రాష్ట్ర ప్రభుత్వ ఆమోదం లభించింది. ఇవి కాకుండా మరో 879 స్కిల్డ్ ఉద్యోగాల భర్తీకి కూడా త్వరలో అనుమతులు రానున్నాయి. ఇరిగేషన్ శాఖలో త్వరలో రానున్న పోస్టులకు బీటెక్, పాలిటెక్నిక్, ఐటీఐ విద్యార్హత ఉన్న వారు అర్హులు.