ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశిఫలాలు: 08-07-2022 శుక్రవారం

Astrology |  Suryaa Desk  | Published : Fri, Jul 08, 2022, 12:18 PM

మేషం
వృత్తి ఉద్యోగాలలో శుభవార్తలు అందుతాయి. సమాజంలో పలుకుబడి పెరుగుతుంది. నూతన వ్యాపారాలను ప్రారంభించి లాభాలను అందుకుంటారు. అన్ని వైపుల నుండి ఆదాయ మార్గాలు ఉంటాయి. జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు.

వృషభం
నూతన ఋణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాలు అనుకున్న సమయానికి పూర్తవుతాయి. కుటుంబ వ్యవహారాలలో చిన్నపాటి సమస్యలు ఉన్న అధిగమిస్తారు. వృత్తి వ్యాపారాలు పుంజుకుంటాయి. ఉద్యోగస్తులకు అనుకూల మార్పులు చోటు చేసుకుంటాయి.

మిధునం
సంతాన వివాహ ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఆకస్మిక ధన లాభం కలుగుతుంది. చాలా కాలంగా వేధిస్తున్న సమస్యలు తొలగుతాయి. ఉద్యోగస్తులకు బాధ్యతలలో ఆటంకాలు అధిగమించి ముందుకు సాగుతారు. సేవా కార్యక్రమాలు నిర్వహిస్తారు. నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.

కర్కాటకం
ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు. దీర్ఘకాలిక అనారోగ్య సమస్యల నుండి ఉపశమనం పొందుతారు. వ్యాపార వ్యవహారాలలో కీలక నిర్ణయాలు అమలుపరుస్తారు. గృహమున నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. మొండి బాకీలు వసూలవుతాయి.

సింహం
నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. గృహమున శుభకార్యాలు నిర్వహిస్తారు. నూతనోత్సాహంతో కొన్ని కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తిచేస్తారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. వృత్తి వ్యాపారాలలో భాగస్వాములతో సఖ్యత కలుగుతుంది. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

కన్య
ఉద్యోగాలలో అధికారులతో సమస్యలు తీరి ఊరట చెందుతారు. ఖర్చుల విషయంలో పునరాలోచన చెయ్యాలి. వ్యాపారాల విస్తరణకు నూతన పెట్టుబడులు అందుతాయి. చేపట్టిన వ్యవహారాల్లో విజయం సాధిస్తారు. సమాజంలో మీమాటకు విలువ పెరుగుతుంది. భూ సంబంధిత క్రయ విక్రయాలు లాభసాటిగా సాగుతాయి.

తుల
ప్రత్యర్థులు కూడా మిత్రులుగా మారి సహాయ సహకారాలు అందిస్తారు. నూతన వాహనాలు కొనుగోలు చేస్తారు. దీర్ఘకాలిక సమస్యలు తీరి మానసిక ప్రశాంతత పొందుతారు. వ్యాపార ఉద్యోగాలలో ఆశించిన మార్పులుంటాయి. చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది. పాత విషయాలు జ్ఞప్తికి తెచ్చుకుంటారు.

వృశ్చికం
కుటుంబంలో కొందరి ప్రవర్తన ఆశ్చర్యం కలిగిస్తుంది. ఉద్యోగాలలో అనుకూలత పెరుగుతుంది. ఆలోచనలు ఆచరణలో పెడతారు. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఆర్థికంగా ఇబ్బంది ఉన్నప్పటికీ ఆదాయం విషయంలో లోటు ఉండదు. వృత్తి వ్యాపారాలు లాభిస్తాయి.

ధనస్సు
నిరుద్యోగులకు కలలు నిజమవుతాయి. ఖర్చుకు తగిన ఆదాయం ఉంటుంది. స్థిరాస్తి వివాదాలు రాజీ చేసుకుంటారు. ముఖ్యమైన కార్యక్రమాలు ప్రారంభించిన సకాలంలో పూర్తిచేస్తారు. వ్యాపారాలకు నూతన ప్రోత్సాహకాలు అందుతాయి. పాతమిత్రుల సమాగమం ఆనందం కలిగిస్తుంది.

మకరం
వాహన కొనుగోలుకు అవరోధాలు తొలగుతాయి. ఆత్మీయుల సహాయ సహకారాలతో ఋణ సమస్యలు నుండి బయటపడతారు. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుండి ఉపశమనం పొందుతారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు.

కుంభం
చిన్నతరహా పరిశ్రమలకు ఒడిదుడుకులు తప్పవు. కుటుంబ వ్యవహారాలలో స్థిరమైన ఆలోచనలు చెయ్యక కొత్త సమస్యలు చోటుచేసుకుంటాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు భాద్యతలు ఉంటాయి. అవసరాలకి ఆదాయం సరిపడక నూతన రుణాలు చేయాల్సి వస్తుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.

మీనం
ప్రణాళికలు అమలు చేసి లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు నూతన అవకాశాలు అందుతాయి. ఇంటా బయట ఆదరణ పెరుగుతుంది. వ్యాపారాలలో నూతన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేస్తారు. అవసరానికి ధన సహాయం లభిస్తుంది. ఉద్యోగస్తులు ఉన్నత పదవులు పొందుతారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com