మేషం
సోదరులతో దీర్ఘకాలికంగా ఉన్న వివాదాలు పరిష్కారమవుతాయి. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. ఆస్తి వివాదాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.
వృషభం
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మిత్రుల నుండి ఆసక్తికర విషయాలు తెలుస్తాయి. మొండి బకాయిలు వసూలవుతాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఉన్నప్పటికీ సకాలంలో పూర్తవుతాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి.
మిధునం
వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. నిరుద్యోగులకు నిరాశ తప్పదు.ఇంటా బయట ఒత్తిడులు పెరుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో అదనపు పని భారం వలన విశ్రాంతి లభించదు. విద్యార్థులు పోటీ పరీక్షల్లో మిశ్రమ ఫలితాలు అందుతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.
కర్కాటకం
చేపట్టిన పనులులో శ్రమాధిక్యత పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు చేజారుతాయి. కీలక వ్యవహారాలలో ఆప్తులతో మాట పట్టింపులు ఉంటాయి. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి.
సింహం
గృహమున శుభకార్యములు నిర్వహిస్తారు. అవసరానికి చేతికి డబ్బు అందుతుంది.నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి. ఉద్యోగాలలో సమస్యల నుండి బయటపడతారు. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. మిత్రులతో చర్చలు చేస్తారు.
కన్య
కుటుంబ సమస్యల పరిష్కార దిశగా సాగుతాయి.రావలసిన ధనం చేతికందుతుంది.నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి. వృత్తి, ఉద్యోగాలలో ఉత్సాహంగా సాగుతాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు.
తుల
జీవిత భాగస్వామితో ఆలయాలు సందర్శిస్తారు. చేపట్టిన పనుల్లో స్వల్ప అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణాలు చేస్తారు. వ్యాపారాలలో ధన నష్టాలుంటాయి, ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు.
వృశ్చికం
కుటుంబ సభ్యుల నుండి ఒత్తిడి పెరుగుతుంది.వ్యాపారాలు నిదానంగా సాగుతాయి, ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు నిర్వహించడంలో విఫలమౌతారు. చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి. ఆస్తి వ్యవహారాలలో వివాదాలు కలుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరుత్సాహం కలిగిస్తాయి.
ధనస్సు
మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారస్తులకు నూతన పెట్టుబడులు అందుతాయి ఉద్యోగాలలో తెలివిగా సమస్యల నుండి బయటపడతారు. సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది.
మకరం
ఉద్యోగులకు సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి. కుటుంబ వాతావరణం చికాకు కలిగిస్తుంది. ఆకస్మిక ధనవ్యయ సూచనలున్నవి. ఆధ్యాత్మిక సేవ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఋణప్రయత్నాలు కలసిరావు. వ్యాపారాలు మరింత మందగిస్తాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి.
కుంభం
పాత సంఘటనలు గుర్తు చేసుకుని బాధపడతారు. నూతన ఉద్యోగ అవకాశములు అందుతాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. ఉద్యోగమున అనుకూల మార్పులు ఉంటాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుని లాభపడతారు.
మీనం
ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు.సంతాన విద్యా ఫలితాలు అంతంత మాత్రంగా ఉంటాయి. చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది. వ్యాపారాలలో తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. వ్యవహారంలో కీలక సమాచారం అందుతుంది.