రాష్ట్రంలో కొత్తగా 26 జిల్లాలు ఏర్పాటయ్యాయి. జిల్లాకో మెడికల్ కాలేజీ, జిల్లా ఆస్పత్రి ఏర్పాటులో భాగంగా కొత్తగా 12 వైద్య కళాశాలల మంజూరు ప్రతిపాదన ఇప్పటికీ పెండింగ్‌లో ఉంది. ఇటీవల ఉక్రెయిన్ – రష్యా యుద్ధం కారణంగా అనేక మంది తెలుగు విద్యార్థులు రాష్ట్రానికి తిరిగి వచ్చారు. వారు తిరిగి చదువు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలి అని వైసీపీ నాయకులూ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. ఇతర మెడికల్ కాలేజీలలో చదువుకోడానికి అనుమతులు ఇవ్వాలి. కోవిడ్ కారణంగా మూడేళ్లుగా జనాభా లెక్కల సేకరణ జరగలేదు. దీంతో 2011 జనాభా లెక్కలను పరిగణలోకి తీసుకోవడంతో రాష్ట్రం అనేక విధాలుగా నష్టపోతోంది. పౌర సరఫరాల విషయంలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. త్వరితగతిన జనాభా లెక్కలు సేకరించాలి అని ప్రతిపాదనలు పెట్టడం జరిగింది.