ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రాశి ఫలాలు: 31-07-2022 ఆదివారం

Astrology |  Suryaa Desk  | Published : Sun, Jul 31, 2022, 07:05 AM

మేషం
దీర్ఘకాలిక ఋణ ఒత్తిడి పెరుగుతుంది. వృత్తి వ్యాపారాలు ఆశించిన రీతిలో రాణించవు. సంతానం కొన్ని విషయాలలో మీ మాటతో విభేదిస్తారు. చేపట్టిన పనులలో అవరోధాలు ఉన్నపటికీ నిదానంగా పూర్తిచేస్తారు. దూర ప్రయాణాలలో వాహన ఇబ్బందులు ఉంటాయి. ఉద్యోగమున అదనపు బాధ్యతలు వలన తగిన విశ్రాంతి ఉండదు.

వృషభం
వ్యాపార ఉద్యోగాలు నిలకడ లోపిస్తుంది. నిరుద్యోగుల కష్టం ఫలించదు. కుటుంబ సభ్యుల ప్రవర్తన వలన మానసికంగా చికాకులు పెరుగుతాయి. ఆర్ధిక వ్యవహారాలు కొంత మందగిస్తాయి. నూతన వాహన కొనుగోలు ప్రయత్నాలు వాయిదా వేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు పనిచేయవు.

మిధునం
ఇతరులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు నుండి వ్యతిరేకత పెరుగుతుంది. ఆర్థిక ఇబ్బందులు నుంచి కొంతవరకు బయటపడతారు. నూతన పరిచయాల వలన ఆర్ధిక లాభాలు కలుగుతాయి వృత్తి ఉద్యోగమున సానుకూల ఫలితాలుంటాయి. పాత బుణాలు తీరి ఊరట పొందుతారు.

కర్కాటకం
దూర ప్రాంతాల నుంచి అరుదైన సమాచారం అందుతుంది. చిన్ననాటి మిత్రులతో స్వల్ప మాట పట్టింపులుంటాయి. ఒక వ్యవహారంలో ఇంటా బయట సమస్యలు పెరుగుతాయి. సంతాన ఆరోగ్య విషయంలో శ్రద్ద వహించాలి. ఆదాయం అంతగా ఉండదు. ఉద్యోగమున తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు.

సింహం
దాయాదులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. కుటుంబ సభ్యుల ఆరోగ్య విషయంలో శుభవార్తలు అందుతాయి. బంధు మిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు. వృత్తి ఉద్యోగాలలో పదోన్నతులు పెరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి కలుగుతుంది. నూతన వ్యాపారమునకు సన్నిహితుల నుంచి పెట్టుబడులు లభిస్తాయి.

కన్య
ఆదాయానికి మించి ఖర్చులు పెరుగుతాయి.చుట్టుపక్కలవారితో ఊహించని విభేదాలు కలుగుతాయి ధన వ్యవహారాలలో చిన్న పాటి ఇబ్బందులు ఉంటాయి. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడం మంచిది. భాగస్వామ్య వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి.సంతాన ఉద్యోగ ప్రయత్నాలు కొంత నిరాశ కలిగిస్తాయి.

తుల
దైవ సేవా కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది కీలక వ్యవహారాలలో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు అందుతాయి. అవసరాలకు సన్నిహితుల నుండి ధన సహాయం లభిస్తుంది. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. నూతన వ్యాపారాల ప్రారంభానికి శ్రీకారం చుడతారు. ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృశ్చికం
దూరపు బంధువుల నుంచి కీలక నమాచారం అందుతుంది. ఆర్ధిక పరిస్థితి గతం కంటే మెరుగుపడుతుంది. కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు. ఉద్యోగమున అధికారుల ఆదరణ పెరుగుతుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. స్ధిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు.

ధనస్సు
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో విశేషంగా పాల్గొంటారు. ప్రయాణాలలో స్వల్ప ఇబ్బందులు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలలో వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. దైవ అనుగ్రహంతో అనుకున్న పనులు పూర్తి చేస్తారు. ఆప్తుల నుండి శుభకార్య ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలలో నూతన ఉత్సాహంతో లాభాలు అందుకుంటారు.

మకరం
ఆర్ధిక ఇబ్బందులు వలన ఒత్తిడి అధికమౌతుంది ఆరోగ్య విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమౌతాయి. ఉద్యోగస్తులు అధికారులతో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి. ఇంటా బయట కొన్ని పరిస్థితులు మరింత చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో కారణం లేకుండా వివాదాలు కలుగుతాయి. నూతన ఋణ యత్నాలు అంతగా కలిసిరావు.

కుంభం
ప్రయాణాలలో నూతన మిత్రులతో పరిచయాలు పెరుగుతాయి. వ్యాపారము భాద్యతలు సమర్థవంతంగా నిర్వహించి లాభాలు పొందుతారు. ఉద్యోగమున అదనపు బాధ్యతలనుండి కొంత ఉపశమనం లభిస్తుంది. ఆర్ధికంగా అనుకూల వాతావరణం ఉంటుంది. గృహ నిర్మాణ ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి.పాత ఋణాలు తీరుతాయి.

మీనం
నిరుద్యోగులకు అప్రయత్న కార్యసిద్ధి కలుగుతుంది సోదరుల సహాయ సహకారములతో నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఇంటా బయట శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. నూతన ప్రయాణాలలో అప్రమత్తంగా వ్యవహరించాలి. వ్యాపారాలు విజయవంతంగా సాగుతాయి. ఆర్ధిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com