ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ జూన్ నెలలో 22 లక్షల భారతీయ ఖాతాలను నిషేధించినట్లు ప్రకటించింది. వాట్సాప్ లో విద్వేషపూరిత ప్రసంగాలు, నకిలీ వార్తలు ప్రచారం చేస్తున్న అకౌంట్లను బ్లాక్ చేసినట్లు వాట్సాప్ ప్రతినిధి గురువారం ఓ నివేదికలో పేర్కొన్నారు. జూన్ 1 నుంచి 30 మధ్య 22.10 లక్షల భారతీయ ఖాతాలను వాట్సాప్ నిషేధించింది. వినియోగదారుల నుండి వచ్చిన ఫిర్యాదులతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.