కొన్ని ఆండ్రాయిడ్ యాప్స్‌లోని మాల్‌వేర్‌లు స్మార్ట్‌ఫోన్ యూజర్ల డేటాకు రిస్క్‌గా మారుతున్నాయి. అలాంటి యాప్స్‌ను గూగుల్ ప్లే స్టోర్ క్రమంగా తొలగిస్తోంది. తాజాగా జోకర్, ఫేస్‌స్టీలర్, కోపర్ మాల్‌వేర్ ఉన్న కొన్ని యాప్స్ గూగుల్ ప్లే స్టోర్‌లో ఉన్నట్టు సెక్యూరిటీ కంపెనీ స్కేలర్ థ్రెట్ ల్యాబ్జ్ తాజాగా గుర్తించింది. దీంతో ప్లే స్టోర్‌లో ఆ యాప్స్‌ను గూగుల్ తొలగించినట్టు సమాచారం. అయితే ఒకవేళ ఇంతకు ముందే ఎవరైనా మీ స్మార్ట్‌ఫోన్‌లో ఈ యాప్స్‌ను ఇన్‌స్టాల్ చేసుకొని ఉంటే వెంటనే డిలీట్ చేయండి. ఎందుకంటే ఫేస్‌స్టీలర్ మాల్‌వేర్ ఉన్న యాప్స్ మీ ఫేస్‌బుక్ సమాచారాన్ని దోచేస్తాయి. జోకర్ మాల్‌వేర్ ఉంటే ఆ యాప్స్.. మీకు తెలియకుండానే పెయిడ్ సబ్‌స్కిప్షన్‌లను యాక్టివేట్ చేసి మీ బ్యాంక్ ఖాతాల్లోనే డబ్బును మాయం చేస్తాయి. కోపర్ ట్రోజన్.. బ్యాంకింగ్ యాప్స్‌ను టార్గెట్ చేస్తుంది.