దేశంలో తక్కువ ధర ఉన్న చైనా స్మార్ట్ ఫోన్లను నిషేధించాని కేంద్రం యోచిస్తోంది. లావా, మైక్రోమ్యాక్స్ వంటివి దేశీయ సంస్థలకు ఊతమిచ్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. భారత్ సేల్స్ వాల్యూమ్స్‌లో రూ.12వేలు అంత కన్నా తక్కువ ధరలు ఉన్న స్మార్ట్ఫోన్లు మూడోవంతు ఉన్నాయి. వీటిల్లో 80 శాతం వాటా చైనా కంపెనీలదే. ఈ నేపథ్యంలో భారత్ ఎంట్రీ లెవల్ మార్కెట్ నుంచి చైనాను తప్పించాలని చూస్తోంది.