ఢిల్లీలో పోలీసులు హైఅలర్ట్ ప్రకటించారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల వేళ దాడులు, అల్లర్లకు పాల్పడే అవకాశాలున్నాయని ఇంటలిజెన్స్ బ్యూరో హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో గట్టి భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. పదివేల మంది బలగాలను పోలీసులు మోహరించారు. గాలిపటాలు, బెలూన్లు ఎగురవేయకుండా అడ్డుకునేందుకు 400 మంది సైనికులను నియమించారు. ఎర్రకోట, ఢిల్లీ పోలీస్ కమాండోల చుట్టూ ఉన్న భవనాలపై షూటర్లను మోహరించనున్నారు.