శ్రీశైలం ప్రాజెక్ట్‌కు వరద కొనసాగుతుంది. 3 గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీరు విడుదల చేశారు. ఇన్‌ఫ్లో 1,51,058 క్యూసెక్కులు, ఔట్‌ఫ్లో 1,47,254 క్యూసెక్కులు ఉంది. శ్రీశైలం పూర్తి నీటిమట్టం 885 అడుగులు, ప్రస్తుతం 885 అడుగులు నీరు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. శ్రీశైలం పూర్తి నీటినిల్వ 215.80 టీఎంసీలు, ప్రస్తుతం 215.70 టీఎంసీలుగా ఉంది.