ఇటీవల కాలంలో గుర్తు తెలియని నంబర్ల నుంచి ఫోన్ కాల్స్ రావడం ఎక్కువైంది. చాలా మంది తెలియక ఆ ఫోన్లను లిఫ్ట్ చేస్తున్నారు. కేవలం ఫోన్ ఎత్తినా సరే ఫోన్ ఎత్తిన వారి అకౌంట్లలో నుంచి డబ్బులు కట్ అవుతున్నాయి. లేదా వారి సమాచారం హ్యాక్ కు గురైతుంది. సైబర్ నేరగాళ్లు టెక్నాలజీని పక్కదారి పట్టించి ఇలా కాల్స్ చేసి దోపిడీలకు పాల్పడుతున్నారు. దీంతో టెలికాం శాఖ అలర్ట్ ప్రకటించింది.
వినియోగదారులు అలర్ట్ గా ఉండాలని సూచించింది. +1 ,+92 ,+968 ,+44 ,+473 , +809, +900 తో ప్రారంభమయ్యే సంఖ్యల నుండి ఫోన్ కాల్స్ వచ్చినా లేదా వాట్సాప్ కాల్స్ వచ్చినా లిఫ్ట్ చేయొద్దని తెలిపింది. మీకు తెలిసిన వ్యక్తి ఫోటోతో ఐనా సరే ఈ నంబర్స్ తో కాల్స్ వస్తే ఎత్తొద్దని టెలికాం శాఖ తెలిపింది. చాలా మంది కేటుగాళ్లు కాల్స్ చేసి సమాచారాన్ని దొంగిలిస్తున్నారు. దాన్ని అడ్డుపెట్టుకొని బెదిరింపులకు పాల్పడి నగదు వసూలు చేస్తున్నారు. మహిళలను బ్లాక్ మెయిల్ చేసి అఘాయిత్యాలకు పాల్పడుతున్నారు. అలాగే వారి ఖాతాలలో నుంచి నేరుగా డబ్బులు కట్ అయ్యేలా చేస్తున్నారు. దీని వల్ల చాలా మంది లబోదిబోమంటూ మొత్తుకుంటున్నారు. అందుకే టెలికాం శాఖ ఈ నంబర్ల నుంచి కాల్స్ వస్తే ఎత్తొద్దని తెలిపింది. ఇప్పటికే పోలీస్ శాఖ కూడా ప్రజలలో ఈ నంబర్ల పై అవగాహన కల్పించింది.