మేషం
సోదరులతో స్ధిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఉద్యోగస్తులకు శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలలో భాగస్తులతో నూతన ఒప్పందాలు చేసుకుంటారు. వృత్తి ఉద్యోగాలలో కీలక నిర్ణయాలు అమలుచేస్తారు. నిరుద్యోగులకు కార్యసిద్ధి కలుగుతుంది. ఆర్ధిక అనుకూలత కలుగుతుంది.
వృషభం
సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. వ్యాపార ఉద్యోగాలు మరింత ఉత్సాహంగా సాగుతాయి. మిత్రుల నుండి కీలక విషయాలు సేకరిస్తారు. మొండి బకాయిలు వసూలవుతాయి. దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి. చేపట్టిన పనులలో జాప్యం కలిగినప్పటికీ సకాలంలో పూర్తిచేస్తారు.
మిధునం
నిరుద్యోగులకు నిరాశ తప్పదు. ఉద్యోగాలలో అదనపు పని భారం వలన తగిన విశ్రాంతి లభించదు. ఇంటాబయట గందరగోళ పరిస్థితులుంటాయి. సంతాన విద్యా విషయాలపై దృష్టి సారించడం మంచిది. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. వ్యాపారాలు మరింత మందగిస్తాయి.
కర్కాటకం
వ్యాపార వ్యవహారాలు నత్తనడకన సాగుతాయి. చేపట్టిన పనులులో శ్రమాధిక్యత కలుగుతుంది. ధన వ్యవహారాలలో కొంత అప్రమత్తంగా వ్యవహరించాలి. కీలక వ్యవహారాలలో సన్నిహితులతో మాట పట్టింపులు ఉంటాయి. నిరుద్యోగుల ప్రయత్న లోపం వలన వచ్చిన అవకాశాలు సద్వినియోగం చేసుకోలేరు.
సింహం
అవసరానికి చేతికిడబ్బు అందుతుంది. గృహమున మిత్రులతో ఆనందంగా గడుపుతారు. నిరుద్యోగులకు నూతన అవకాశములు అందుతాయి. చేపట్టిన వ్యవహారాలలో విజయం సాధిస్తారు. ఉద్యోగాలలో సమస్యలు తొలగుతాయి. మిత్రులతో కీలక విషయాలలో చర్చలు చేస్తారు. వృత్తి వ్యాపారాలలో నష్టాలు భర్తీ అవుతాయి.
కన్య
వృత్తి, ఉద్యోగాలు ఉత్సాహంగా సాగుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. రావలసిన ధనం సకాలంలో చేతికి అందుతుంది. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. కుటుంబ సమస్యలు పరిష్కరించుకుంటారు. ఆప్తులనుండి అరుదైన ఆహ్వానాలు అందుతాయి.
తుల
చేపట్టిన పనుల్లో అవరోధాలుంటాయి. కుటుంబ సభ్యులతో దూరప్రయాణ సూచనలున్నవి. ఋణదాతల ఒత్తిడి నుండి బయటపడటానికి నూతన ఋణాలు చేస్తారు. జీవిత భాగస్వామితో ఊహించని వివాదాలు కలుగుతాయి. వృత్తి ఉద్యోగాలు సామాన్యంగా సాగుతాయి. వ్యాపారాలలో స్వల్ప ధన నష్టాలుంటాయి.
వృశ్చికం
ఆస్తి వ్యవహారాలలో సోదరులతో వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యుల ప్రవర్తన చికాకు పరుస్తుంది. వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలించవు. చేపట్టిన పనులలో జాప్యం కలుగుతుంది. ఉద్యోగమున అప్పగించిన బాధ్యతలు సమర్థవంతంగా నిర్వహించడంలో విఫలమౌతారు.
ధనస్సు
సంఘంలో ప్రముఖుల నుండి విశేషమైన ఆదరణ లభిస్తుంది. వ్యాపారస్తులకు నూతన అవకాశములు అందుతాయి. మిత్రుల సహాయ సహకారాలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారాలలో వివాదాలకు సంభందించి కీలక సమాచారం అందుతుంది. ఉద్యోగాలలో ఓర్పుతో వ్యవహరించి సమస్యల నుండి బయట పడతారు.
మకరం
ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కుటుంబ వాతావరణం గందరగోళంగా ఉంటుంది. ఆకస్మిక ధన వ్యయ సూచనలున్నవి. వ్యాపారాలు మరింత మందకొడిగా సాగుతాయి. ప్రయాణాలలో వాహన ఇబ్బందులుంటాయి. ఋణ ప్రయత్నాలు కలసిరావు. ఉద్యోగమున సహోద్యోగులతో మనస్పర్థలు కలుగుతాయి.
కుంభం
విలువైన గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. ఉద్యోగమున ఆశించిన మార్పులు కలుగుతాయి. ఇంటా బయట కీలక నిర్ణయాలు తీసుకుంటారు. వృత్తి వ్యాపారమున వ్యవహార అనుకూలత కలుగుతుంది. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. పాత సంఘటనలు గుర్తు చేసుకుంటారు. నూతన ఉద్యోగ అవకాశములు లభిస్తాయి.
మీనం
చేపట్టిన పనులు నిదానంగా పూర్తవుతాయి. ఉద్యోగాలలో శ్రమకు తగిన ఫలితం అందదు. సన్నిహితుల నుండి అందిన సమాచారం ఆనందం కలిగిస్తుంది. సంతాన విద్యా ఫలితాలు ఆశించిన రీతిలో ఉంటాయి. వ్యాపారాలలో ఆలోచించి నిర్ణయాలు తీసుకొని ముందుకు సాగడం మంచిది.