శ్రావణమాసం శనివారం కావడంతో డి. హీరేహాల్ మండలంలోని ప్రసిద్ధిచెందిన పుణ్యక్షేత్రం శ్రీ మురడి ఆంజనేయ స్వామి ఆలయానికి భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూలతో అలంకరణ చేశారు. ప్రతీఏడూ శ్రావణమాసంలో శనివారం, మంగళవారం భక్తులు వివిధప్రాంతాల నుంచి తరలివచ్చి స్వామివారిని దర్శించుకోవడం ఇక్కడ ప్రత్యేకత. భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎండోమెంటు అధికారులు ఏర్పాట్లు చేశారు