గిద్దలూరు: రాష్ట్ర వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ జనాబ్ ఖాదర్ బాషాను శుక్రవారం ప్రజా సంకల్ప వేదిక సభ్యులు కలిసి ఘనంగా సన్మానించారు. అనంతరం ఆయనతో మాట్లాడుతూ.. ప్రజా సమస్యలపై ప్రజా సంకల్ప వేదిక చేస్తున్న పోరాటాన్ని వారికి వివరించారు. వారు చేస్తున్న కార్యక్రమాలను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంకల్ప వేదిక రాష్ట్ర అధ్యక్షుడు, హైకోర్టు న్యాయవాది మదిరె రంగ సాయి రెడ్డి మరియు సభ్యులు పాల్గొన్నారు.