ఢిల్లీలో నూతన మద్యం పాలసీలో చోటుచేసుకున్న అవకతవకల వ్యవహారం రాకీయంగా దుమారం రేపుతోంది. మరోవైపు ఈ కేసుపై కేంద్ర దర్యాప్తు సంస్థ శుక్రవారం దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ కేసులో పక్కా ఆధారాలతో ఎఫ్ఐఆర్ నమోదు చేసిన అధికారులు.. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియాను ఏ1గా, ఏపీకి చెందిన ఐఏఎస్ అధికారి అరవ గోపీకృష్ణ ఏ2 చేర్చారు.