ప్రపంచవ్యాప్తంగా కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. మానవ శరీరంలో కిడ్నీ అత్యంత ప్రాముఖ్యమైన అవయవం. శరీరంలోని మలినాలను బయటకు పంపడంలో కిడ్నీలది కీలక పాత్ర. రక్తాన్ని శుద్ధి చేయడం ద్వారా మూత్రపిండాలు ఒంట్లో పేరుకుపోయిన వ్యర్థాలను ఎప్పటికప్పుడు బయటకు పంపుతాయి. అయితే సరైన ఆహార నియమాలు పాటించకుంటే కిడ్నీలు పాడవుతాయి. మారుతున్న జీవన శైలీతో కిడ్నీలో రాళ్లు వస్తున్న బాధితుల పెరిగిపోతున్నారు. కిడ్నీలో రాళ్లు రాకుండా ఉండాలంటే ఈ క్రింది నియమాలు పాటించాలని వైద్యులు సూచిస్తున్నారు.
సాధారణ వ్యక్తి రోజుకు 3 నుండి 4 లీటర్లు నీళ్లు తీసుకోవాలి. క్రమంగా నిమ్మ రసం, ఆరంజ్ జ్యూస్, కొబ్బరి నీళ్లు తీసుకోవడం ద్వారా కిడ్నీల్లో రాళ్లు రాకుండా కాపాడుకోవచ్చు. అలాగే మాంసహారం, పాలకూర, ఉప్పు, టమాట, క్యాబేజి, ఆల్కహాల్ తక్కువగా తీసుకోవాలని సూచిస్తున్నారు. మూత్రం రంగు మారినా, మూత్రంలో అసాధారణ మార్పులు కనిపించినా కిడ్నీ సమస్య ఉందని భావించి వైద్యులను సంప్రదించాలి.