పలాసలో ముందస్తుగా నోటీసులు ఇవ్వకుండా ఆక్రమణ తొలగింపు పేరుతో పేదల ఇళ్లను కూలగొట్టి వైసిపి మంత్రి అరాచకం సృష్టిస్తున్నారు.మీరు ఎన్ని అడ్డంకులు సృష్టించిన,దౌర్జన్యం చేసిన సరే పేదల పక్షాన పోరాడేందుకు తెలుగుదేశం పార్టీ వెనుకడుగు వేయదు అని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచెం నాయుడు ధీమా వ్యక్త పరిచారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ..... బాధితులను పరామర్శించడానికి వెళ్లేందుకు అనుమతించకపోవడం వైసిపి నిరంకుశ పాలనకు పరాకాష్ట,మమ్మల్ని అడ్డుకోవడానికి పోలీసు వ్యవస్థను వాడుకొని రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛను కాలరాస్తున్నారు.వైసిపి నిరంకుశ పాలనకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. వంద గొడ్లను తిన్న రాబందు ఒక్క గాలివానకు చచ్చినట్లు...ప్రజాబలం ముందు ఎంతటి వారైనా తలవంచాల్సిందే...! అని తెలియజేసారు.