అనంతపురం జిల్లా, బుక్కరాయసముద్రం మండలం రేకులకుంట గ్రామంలో ఆ గ్రామ ప్రజలు, వైద్యులు నిర్వహించిన ఉచిత మెగా వైద్య శిబిరాన్ని ప్రారంభించిన జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి IPS .
ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.... రేకులకుంట గ్రామంలో మొత్తం 14 మంది డాక్టర్లుగా వివిధ ప్రాంతాలలో సేవలు అందిస్తుండటం అభినందనీయం. గ్రామానికి చెందిన చక్కా రామయ్య, మండ్లీ నాగన్నల కుటుంబాల నుండి 14 మంది డాక్టర్లు కావడం ముదావహం.
స్వగ్రామంలో సేవ చేయాలనే సంకల్పంతో ఈరోజు రేకులకుంటలో నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరంలో ఆర్థో, కార్డియాలజీ, డెర్మటాలజీ, జనరల్ , తదితర విభాగాలకు చెందిన డాక్టర్లు ప్రజలకు సేవలు అందించారు అని ప్రశింసించారు