ఇటీవల పలాసలో వైసీపీ దౌర్జన్యానికి గురైన బాధితుల పక్షాన అండగా నిల్చినందుకు వెళ్తుంటే అడ్డుకున్నారు? ఇప్పుడు పలాస మండల టీడీపీ అధ్యక్షుడు పినకాన అజయ్ కుమార్ గారి కుమార్తె వివాహానికి హాజరయ్యేందుకు వెళ్తుంటే పోలీసు వ్యవస్థను అడ్డుపెట్టుకుని మమ్మల్ని అడ్డుకుంటున్నారు అని టీడీపీ నాయకులూ అచ్చేమ్ నాయుడు ఆవేదన వ్యక్త పరిచారు.
ఈ దుర్మార్గపు వైసీపీ ప్రభుత్వం పోలీసు వ్యవస్థ అడ్డుపెట్టుకుని రాజ్యాంగ ఇచ్చిన స్వేచ్ఛను హరిస్తుంది.ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య వ్యవస్థ నడుస్తుందా? రాచరిక వ్యవస్థ నడుస్తుందా? అని ఆయన ప్రశ్నించారు.