అనంతపురం ఇన్ఛార్జి డీఎస్పీ ఆర్ల శ్రీనివాసులు, శింగనమల సి.ఐ అస్రార్ బాషాలు ఇతర ప్రభుత్వ విభాగాలతో కలసి గార్లదిన్నె, లోలూరు క్రాస్ సమీపంలోని జాతీయ రహదారిపైనున్న బ్లాక్ స్పాట్స్ ను ఈరోజు పరిశీలించారు.
ఆయా బ్లాక్ స్పాట్స్ వద్ద రోడ్డు ప్రమాదాలు జరుగకుండా ముందస్తు చర్యలలో భాగంగా లైటింగ్ , పెయింటింగ్స్ వేయించాలని మరియు సైన్ బోర్డ్స్ ను ఏర్పాటు చేయాలని డీఎస్పీ సూచించారు.