రోడ్డు ప్రమాదాల నివారణా చర్యలలో భాగంగా కాకినాడ జిల్లా SP శ్రీ M.రవీంద్రనాథ్ బాబు, IPS., ఆదేశాల మేరకు ఈ రోజు స్థానిక భవాని ఫంక్షన్ హాల్ లో ట్రాఫిక్ DSP శ్రీ P.మురళీ కృష్ణ రెడ్డి , మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ శ్రీ చైత్యన్య కృష్ణ ల అధ్యక్షతన కాకినాడ పట్టణ ఆటో ఓనర్స్ & డ్రైవర్స్ యూనియన్ సభ్యులకు ట్రాఫిక్ చట్టాలు మరియు రహదారి భద్రతపై మెగా అవగాహనా సదస్సు నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ DSP మరియు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ లు సదస్సుకు హాజరైన ఆటో డ్రైవర్ లకు రోడ్డు భద్రతకు తీసుకోవలసిన జాగ్రత్తలు, ట్రాఫిక్ చట్టాలు, నియమ నిబంధనలు, ఓవర్ లోడింగ్, ఓవర్ స్పీడింగ్, ఫిట్నెస్ లేని వాహనాలు నడపడం వల్ల జరిగే అనర్ధాలు, రాంగ్ పార్కింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్, చట్ట పరమైన చర్యలు, ట్రాఫిక్ చలనాలు తదితర అంశాలపై అవగాహన కల్పించారు. సైబర్ నేరాల గురించి చెప్పి సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 అనే టోల్ ఫ్రీ నెంబర్ కు ఫోన్ చెయ్యాలని DSP గారు సూచించారు. ఈ కార్యక్రమంలో కాకినాడ సిటి ఆటో యూనియన్ ప్రెసిడెంట్ మూర్తి, సెక్రటరీ నాగరాజు, ట్రాఫిక్ SIలు మరియు సిబ్బంది పాల్గొన్నారు.