తెలుగుదేశం పార్టీలో యువతకు పెద్దపీట వేస్తామని పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు ఆర్. శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. రాయచోటి పట్టణంలో ఆదివారం యువజన విభాగం ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. వైకాపా నేతల అరాచకాలు, అప్రజాస్వామిక పాలన చూసి ప్రజలు విసిగిపోయారన్నారు. ఉద్యోగావకాశాల్లేక నిరు ద్యోగులు ఇతర రాష్ట్రాలకు తరలిపోయే పరిస్థితి నెలకొం దన్నారు. రాయచోటి నియోజకవర్గానికి రూ. 3 వేల కోట్ల నిధులు తెచ్చానని చెబుతున్న ఎమ్మెల్యే ఎక్కడ ఖర్చుపెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. కనీసం హంద్రీ-నీవా కాలువ పనులను పూర్తి చేయలేకపోయారన్నారు. తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అరెస్టు చేయడం చూస్తే రాష్ట్రం వైకాపా జాగీరా అని ప్రశ్నించారు.
రాయలసీమ పట్టభ ద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిని గెలి పించాలని పిలుపునిచ్చారు. వైకాపా ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు యువత నడుం బిగించాలని తెదేపా నియో జకవర్గ బాధ్యుడు ఆర్. రమేష్ కుమార్ రెడ్డి పేర్కొన్నారు. ఎమ్మెల్సీ అభ్యర్థి రాంగోపాల్రెడ్డి మాట్లాడుతూ పట్టభ ద్రుల ఎన్నికల్లో తనకు మద్దతునిచ్చి గెలిపించాల్సిన బాధ్యత యువతపై ఉందన్నారు.